బెంబేలెత్తిన ఐటీ కారిడార్.ట్రాఫిక్ సమస్య రోజురోజుకీ తీవ్రం
ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది.
Traffic hyderabad


హైదరాబాద్, 16 ఏప్రిల్ (హి.స.)ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఇప్పటికే అత్యంత రద్దీగా ఉండే గచ్చిబౌలి, నానక్రామ్గూడ, నార్సింగి, హైటెక్ సిటీ మార్గాల్లో ఒక వాహనం బ్రేక్డౌన్ అయినా చాలు.. క్షణాల్లోనే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. . మండతున్న ఎండల్లో కార్లు, బైక్లపై ప్రయాణిస్తున్న వారు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకున్నారు. కొందరు ఉద్యోగులు ఆఫీసులకు ఆలస్యంగా చేరుకోగా, మరికొందరు ముఖ్యమైన సమావేశాలు కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు కిలోమీటరు పైగా బారులు తీరగా, ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి పోలీసులకు గంటన్నరకు పైగా సమయం పడుతోంది

గచ్చిబౌలి, హైటెక్సిటీ ప్రాంతాలు నగరానికి ఐటీ హబ్గా మారిన తర్వాత ఇక్కడ వాహనాల సంఖ్య అమాంతం పెరిగింది. నగరం నలుమూలల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఐటీ కారిడార్కు వచ్చి వెళుతుంటారు. దీంతో ఇక్కడి రోడ్లపై వాహనాల రద్దీ అధికంగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట వాహనాలు బ్రేక్డౌన్ కావడం ట్రాఫిక్జామ్కు దారి తీస్తోందని పోలీసులు పేర్కొంటున్నారు. ఐటీ కారిడార్లోని గచ్చిబౌలి జంక్షన్, ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) వైపు, మసీద్బండా, ఐకియా ఫ్లైఓవర్, హైటెక్సిటీ మెయిన్ రోడ్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలు తరచూ చోటు చేసుకుంటున్నాయి.

రోజూ కార్యాలయాలకు చేరుకోవడానికి గంటల సమయం పడుతోందని, ట్రాఫిక్లోనే విలువైన సమయం వృథా అవుతోందని వాపోతున్నారు. వాహనాల తొలగింపుకు ఫాస్ట్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేయడం, ప్రత్యామ్నాయ మార్గాలు అభివృద్ధి చేయడం, ట్రాఫిక్ మానిటరింగ్ను మరింత బలోపేతం చేయడం అవసరమని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో ఐటీ కారిడార్ ట్రాఫిక్ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande