
అమరావతి, 16 ఏప్రిల్ (హి.స.)ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు. జాతి కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
గురువారం తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ‘సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారి 178 వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. స్త్రీ విద్య కోసం ఉద్యమించిన మహనీయుడు ఆయన. ఆనాటి దురాచారం అయిన బాల్య వివాహాలను ఖండించి, వితంతు వివాహాలు ప్రోత్సహించిన ధీశాలి. ఆ మహనీయుడిని స్మరించుకుంటూ ఘననివాళి అర్పిస్తున్నాను. అని సీఎం చంద్రబాబు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్