
అమరావతి, 16 ఏప్రిల్ (హి.స.)
గుంతకల్లు(అనంతపురం):వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని అనంతపురం మీదుగా యశ్వంతపూర్-జల్పైగురి మధ్య రెండు ట్రిప్పుల ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. యశ్వంతపూర్-న్యూ జల్పైగురి ప్రత్యేక రైలు (నం. 06567) ఈనెల 17, 24 తేదీల్లో (శుక్రవారాల్లో) యశ్వంతపూర్లో ఉదయం 7 గంటలకు బయలుదేరి మూడోరోజు సోమవారం ఉదయం 7 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (నం.06568) ఈనెల 20, 27 తేదీల్లో (సోమవారాల్లో) న్యూ జల్పైగురి స్టేషన్లో ఉదయం 8.30కి బయలుదేరి మూడో రోజైన గురువారం ఉదయం 9.55 గంటలకు బెంగళూరు కంటోన్మెంటు స్టేషన్కు చేరుకుంటుందన్నారు.
ఈ రైలు యల్హంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుత్తి, డోన్, నంద్యాల, మార్కాపూర్ రోడ్, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కొత్తవలస, విజయనడరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బ్రహ్మపూర్, బాలుగావ్, ఖుద్రా రోడ్, భువనేశ్వర్, కటక్, జాజ్పూర్ కెయోంజహార్ రోడ్, భద్రక్, ఖరగ్పూర్, అందుల్, డాన్కుని, బర్ధమాన్, బోల్పూర్ (శాంతినికేతన్), రాంపూర్ హట్, న్యూ ఫరక్కా, మాల్డా టౌన్, కిష్ణాగంజ్ స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు.
ప్రయాణికుల రద్దీ నియంత్రణకు యశ్వంతపూర్-సహార్స మధ్య వయా గుత్తి మూడు ట్రిప్పుల ప్రత్యక వీక్లీ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సహర్స-యశ్వంతపూర్ ప్రత్యేక రైలు (నం. 05551)ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకూ గురువారాల్లో రాత్రి 10.25 గంటలకు సహర్సలో బయలుదేరి రెండు రోజుల తర్వాత శనివారం రాత్రి 10.30కి యశ్వంతపూర్కు చేరుకుంటుందన్నారు.
దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 05552) ఈ నెల 19 నుంచి మే 3వ తేదీ వరకూ ఆదివారాల్లో ఉదయం 7 గంటలకు యశ్వంతపూర్లో బయలుదేరి రెండు రోజుల తర్వాత మంగళవారం ఉదయం 11 గంటలకు సహార్సకు చేరుతుందన్నారు. ఈ రైలు సిమ్రి భక్తియార్పూర్, మన్సి, ఖగారియా, బెగుసరాయ్, న్యూ బరౌని, కియుల్, ఝాఝా, జసిది, మధుపూర్, చిత్తరంజన్, అశన్సౌల్, దుర్గాపూర్, బర్ధామన్, డంకుని, ఖరగ్పూర్, బేలేశ్వర్, భద్రక్, కటక్, భువనేశ్వర్, ఖుద్రా రోడ్, విజయనగరం, విశాఖపట్టణం, దువ్వాడ, విజయవాడ, గుత్తి, ధర్మవరం, హిందూపురం, యల్హంక స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ