
అమరావతి, 16 ఏప్రిల్ (హి.స.)వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు.. దైవం అంటే భక్తి లేదు.. దేశం అంటే ద్వేషం.. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటారని జగన్ తీరుపై లోకేశ్ మండిపడ్డారు. ఉద్యోగాలు వస్తాయంటే ఉసూరుమంటూ ఏడుస్తారని వ్యంగ్యంగా అన్నారు. రప్పా.. రప్పా నరుకుతాం.. అమరావతిని మార్చేస్తాం.. కట్టినవన్నీ కూల్చేస్తాం.. ఏమిటీ దుర్మార్గ పనులు జగన్రెడ్డి? అంటూ వైసీపీ అధినేతను మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా సూటిగా నిలదీశారు.
దేశ రక్షణకు అధునాతన బోట్ల తయారీ కంపెనీ రాష్ట్రానికి వస్తే.. స్వాగతించాల్సింది పోయి తిరిమేస్తానంటారా? ఇదేం రాక్షస మనస్తత్వం? అంటూ జగన్ వైఖరిని మంత్రి లోకేశ్ ఎండగట్టారు. మత్స్యకారుల పిల్లలకు వెయ్యికిపైగా ఉద్యోగాలు వస్తాయంటే.. ఆనందించాల్సింది పోయి అడ్డుకుంటామనడం సైకోయిజమే అవుతుందంటూ జగన్ వ్యక్తిత్వాన్ని మంత్రి లోకేశ్ వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్