ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కలెక్టర్


కామారెడ్డి, 16 ఏప్రిల్ (హి.స.)

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99

రోజుల కార్యచరణలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మండల సమావేశంలో లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యంగా పరిగణించి, నిర్ణీత కాలంలో పరిష్కారం చూపించాలని సూచించారు. తమ

గ్రామ స్థాయిలో ఎదురవుతున్న తాగునీరు, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ సర్పంచ్లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కనీసం పది మంది రైతులతో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయిల్ పామ్ పంట ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం అందిస్తున్న

ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని కోరారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, శిక్షణలు అందిస్తూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంతో పాటు, ప్రతి ఇంటికి అవగాహన కల్పించే బాధ్యత సర్పంచ్లపై ఉందన్నారు. ఆయిల్ పామ్ వంటి లాభదాయక పంటలపై రైతులకు ప్రోత్సాహం కల్పించి, వ్యవసాయ రంగ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande