
న్యూ ఢిల్లీ, 16 ఏప్రిల్ (హి.స.)పార్లమెంట్ సమావేశాల్లో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గ పునర్విభజన బిల్లుపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చర్చను ప్రారంభించారు. అయితే.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. మహిళా బిల్లుకు నిరసనగా సాహిర్ లుధియాన్వి రాసిన ఓ కవితను లోక్సభా ముఖంగా చదివి వ్యతిరేకించారు.
ఈ బిల్లు సమాఖ్య వాద ఉల్లంఘన కిందకు వస్తుందని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొంటూ.. దీనిని సభలో ప్రవేశపెట్టడాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని అన్నారు. ఈ చర్య మహిళా రిజర్వేషన్కు సంబంధించినది కాదని, ఇది ముస్లిం ప్రాతినిధ్యాన్ని తుడిచివేసే చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఈ బిల్లు మరింత అధికారాన్ని ఇస్తుందని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అరికడుతుందని ఒవైసీ వాదించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్