కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న రైతుల రాస్తారోకో
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న రైతుల రాస్తారోకో
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న రైతుల రాస్తారోకో

నిర్మల్, 16 ఏప్రిల్ (హి.స.)

ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న అన్నదాతలు.. వాటిని అమ్ముకునేందుకు అంతకు రెట్టింపు కష్టాలు పడుతున్నారు. అవసరమైన బస్తాలు రాక.. కాంటాలు కాక.. తిరిగి ఇంటికి వెళ్లలేక రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో రహదారిపై బైఠాయించి మొక్కజొన్న రైతుల రాస్తారోకో చేపట్టారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని లక్ష్మణ్ చందా మండలం కనకాపూర్ గ్రామం వద్ద NH 61 రహదారిపై రాస్తారోకో చేయడంతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

 rajesh pande