కాకినాడ సెజ్కు మరో భారీ పరిశ్రమ.. రూ.700 కోట్ల పెట్టుబడితో ప్లాంట్
కాకినాడ సెజ్కు మరో భారీ పరిశ్రమ.. రూ.700 కోట్ల పెట్టుబడితో ప్లాంట్
kakinada


కాకినాడ, 16 ఏప్రిల్ (హి.స.)

ఏపీలో పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పరిశ్రమలను నెలకొల్పే దిశగా చేపడుతున్న చర్యలు ఫలిస్తున్నాయి. తాజాగా కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్) పరిధిలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. చెన్నైకి చెందిన గ్రీన్ కోక్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.700 కోట్ల పెట్టుబడితో ఇక్కడ పరిశ్రమను స్థాపించనుంది.

ఈ మేరకు గ్రీన్ కోక్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, కాకినాడ సెజ్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. గ్రీన్ కోక్ ఎనర్జీ ఎండీ నటరాజన్, సెజ్ ఎండీ, సీఈవో రామ్రెడ్డి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ పరిశ్రమ ద్వారా స్టీల్ ఉత్పత్తిలో కీలకమైన మెటలర్జికల్ కోక్ను తయారు చేస్తారు. కాకినాడ సెజ్లోని ఏవీ నగరం సమీపంలో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో దాదాపు వెయ్యి మందికి ప్రత్యక్షంగా, మరో వెయ్యి మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తద్వారా కాకినాడ జిల్లాలోని తొండంగి, ఉప్పాడ మండలాల పరిధిలో పారిశ్రామిక కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇటీవలే అనకాపల్లి జిల్లాలో మిట్టల్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయడం దీనికి నిదర్శనం. ఇప్పుడు కాకినాడ సెజ్లో మరో కీలక పరిశ్రమ రావడం పారిశ్రామిక ప్రగతికి ఊతమిస్తోంది. ఇప్పటికే కాకినాడ సెజ్లో అరబిందో ఫార్మాకు చెందిన లైఫియస్, క్యూలే, పోర్టు పరిశ్రమలు ఉన్నాయి. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రూ.2,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన లైఫియస్ ఫార్మా పరిశ్రమ ప్రారంభమైంది.

ఇప్పుడు గ్రీన్ కోక్ ఎనర్జీ రాకతో ఈ ప్రాంతం పారిశ్రామిక హబ్గా మరింత అభివృద్ధి చెందనుంది. సెజ్లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలను అందిస్తూ, మరిన్ని కంపెనీలను ఆకర్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే మరిన్ని పరిశ్రమలు రాష్ట్రానికి రానున్నాయని ప్రభుత్వ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande