
అమరావతి, 16 ఏప్రిల్ (హి.స.)
గత ఐదేళ్లు మత్స్యకారుల పొట్టకొట్టి అరాచక పాలన సాగించారని మాజీ సీఎం జగన్(Former Cm Jagan)పై మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) నిప్పులు చెరిగారు. జువ్వలదిన్నె హార్బర్(Juvvaladinne Harbor)కు నిధులు, బిల్లులు ఆపేసి మత్స్యకారులను ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తి జగన్ అని ఆయన ధ్వజమెత్తారు. హార్బర్ల నిర్మాణాల్లో ఇష్టానుసారంగా ఎస్టిమేట్లు పెంచేసి, భారీగా కమీషన్లు దండుకున్నారని మంత్రి ఆరోపించారు.
జగన్ది అభివృద్ధి చేసే మనస్తత్వం కాదని, కేవలం దోచుకోవడమే లక్ష్యంగా పాలన సాగించారని కొల్లు రవీంద్ర విమర్శించారు. మత్స్యకారుల ప్రయోజనాల కంటే రాజకీయ స్వార్థమే జగన్కు ముఖ్యమని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు బోట్లను పట్టుకుంటే, దానిపై కూడా జగన్ నీచమైన దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన కొల్లు రవీంద్ర.. ఆ పార్టీకి ఉండాల్సింది గొడ్డలి గుర్తేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అరాచక శక్తులకు కాలం చెల్లిందని, కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV