మంచిర్యాల జిల్లాలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు
మంచిర్యాల జిల్లాలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు
heat


శ్రీరాంపూర్,, 16 ఏప్రిల్ (హి.స.)

మంచిర్యాల జిల్లాలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ఓసీపీలతో పాటు భూగర్భ గనులు నిప్పు ల కుంపటిని తలపిస్తున్నాయి. నాలుగు రో జులుగా శ్రీరాంపూర్ ఏరియాలో 41 నుం చి 44 డిగ్రీల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భగ భగ మండే ఎండతో పాటు వడగాలులతో పని ప్రదేశా ల్లో సింగరేణి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్మికుల రక్షణ కోసం యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. మంచిర్యా ల జిల్లాలో సింగరేణి బొగ్గు గనులు, జైపూ ర్ విద్యుత్ కేంద్రం, సిరామిక్, సిమెంట్ పరిశ్రమలున్న ప్రాంతాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. ఇక్కడి ఉపరితల గను లు 60 నుంచి 160 మీటర్ల వరకు లోతులో ఉన్నాయి. ప్రతి 40 మీటర్ల లోతుకు ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో ఇక్కడ సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు ఉ ష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. జైపూర్లోని బొగ్గు ఆధారిత సింగరేణి వి ద్యుత్ కేంద్రంతో పాటు ఓసీపీల్లో పేలుళ్లకు వాడే పదార్థాల నుంచి కర్భన ఉద్గారాలు, భారీ యంత్రాల నుంచి వచ్చే వేడి కూడా అధిక ఉష్ణోగ్రతకు కారణమవుతున్నది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande