
అమరావతి, 16 ఏప్రిల్ (హి.స.)
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన నారా లోకేశ్కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. లోకేశ్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఈ కొత్త బాధ్యతల్లో ఆయన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేస్తున్న లోకేశ్, ఇప్పుడు పార్టీ పరంగా కీలకమైన బాధ్యతలు చేపట్టడం శుభపరిణామమని పేర్కొన్నారు.
నారా లోకేశ్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత శక్తిమంతంగా ముందుకు సాగాలని, యువతకు ఆదర్శంగా నిలవాలని పవన్ కల్యాణ్ కోరుకున్నారు. ఇప్పటికే తన శాఖల ద్వారా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న ఆయన, పార్టీని కూడా అదే స్థాయిలో బలోపేతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ లోకేశ్ తన సమర్థతను చాటుకుంటారని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని పవన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi