మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభించాలి
మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభించాలి
మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభించాలి


ఆదిలాబాద్ 16 ఏప్రిల్ (హి.స.)

మూత పడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ (సీసీఐ)ను కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ప్రారంభించాలని, లేనిపక్షంలో రైతుల వద్ద సేకరించిన భూములను తిరిగి అ ప్పగించాలంటూ సీసీఐ సాధన కమిటీ సభ్యులు డి మాండ్ చేశారు. గురువారం కమిటీ సభ్యులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీసీఐని సందర్శించారు. అక్కడ జరుగుతున్న చెట్ల తీసివేత, భూములు చదును చేసే పనులు అడ్డుకున్నారు. పరిశ్రమ ముందు ఆందోళన చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పనులు చేస్తున్న జేసీబీతోపాటు కార్మికులను అక్కడి నుంచి పంపించేశారు. కేంద్ర హోంశా ఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ, ఎమ్మెల్యేలు మూతపడిన సీసీఐని తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఐలో చెట్ల తీసివేత, ఇతర పనులు ఎందుకు చేస్తున్నారనే విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande