
అమరావతి, 16 ఏప్రిల్ (హి.స.)
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయిన తర్వాత గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) చాలా కాలంగా రాజకీయాలకు, మీడియాకు దూరంగా ఉంటున్న వల్లభనేని వంశీ మోహన్ తాజాగా పోలీసు గడప తొక్కారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మాజీ మంత్రి, వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానితో కలిసి అడిషనల్ ఎస్పీని కలిశారు.
ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో తనపై పథకం ప్రకారం అసత్య ప్రచారాలు చేస్తున్నారని వంశీ ఆరోపించారు. ఒక ప్రైవేట్ విందుకు సంబంధించిన విజువల్స్ను తన అనుమతి లేకుండా రహస్యంగా రికార్డ్ చేశారని, వాటిని కావాలని ఎడిట్ చేసి, మార్ఫింగ్ చేసిన ఆడియోతో తప్పుదారి పట్టించే థంబ్నెయిల్స్ పెట్టి ప్రసారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అది పూర్తిగా సన్నిహితుల మధ్య జరిగిన ప్రైవేట్ వేడుక అని, దానికి రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
తనపై కావాలనే అసత్య వార్తలు ప్రసారం చేసిన సదరు యూట్యూబ్ ఛానెళ్లకు ఇప్పటికే తన తరపు న్యాయవాదుల ద్వారా లీగల్ నోటీసులు పంపినట్లు వంశీ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV