బీజేపీ మిత్రపక్షాలకు భవిష్యత్తులో ఇబ్బందులే: సీఎం రేవంత్ రెడ్డి
బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ భవిష్యత్తులో కష్టంగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే అవుతుందని పేర్కొన్నారు.
Revanthreddy


హైదరాబాద్, 18 ఏప్రిల్ (హి.స.)బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ భవిష్యత్తులో కష్టంగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే అవుతుందని పేర్కొన్నారు. నితీశ్ కుమార్, ఏక్ నాథ్ షిండేలా పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నామని తెలిపారు. ఈరోజు(శనివారం) ఢిల్లీలో మీడియాతో సీఎం చిట్చాట్ చేశారు. ప్రస్తుతం బీజేపీకి కేంద్రంలో సీట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి టీడీపీకి ఇంపార్టెన్స్ ఇస్తోందని పేర్కొన్నారు.

లోక్సభ, రాజ్యసభ ఉన్నది చట్టాలు చేయడానికి మాత్రమేనని చెప్పుకొచ్చారు. వాటిని ఇంప్లిమెంట్ చేసేది స్థానికంగా ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు అధికార యంత్రాంగమని తెలిపారు. 2/3 మెజార్టీ వచ్చినంత మాత్రాన అన్నింటిని చట్టాలు చేయలేమని పేర్కొన్నారు. కేంద్రంలో మెజార్టీ ఉందని ప్రధానిగా ఉన్న ఎవరైనా తనకు తనకు రాజుగా 2/ 3 మెజార్టీతో చట్టం చేసుకుంటే ఒప్పుకోరు కదా అని ప్రశ్నించారు. డిక్టేటర్షిప్ని ఎవరు ఒప్పుకోరని చెప్పారు. ఏపీలో ప్రతిపక్షానికి కేవలం 11 సీట్లే ఉన్నాయని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని సీఎం రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande