సీఎం చంద్రబాబుకు పెళ్లి పత్రిక అందించిన బెల్లంకొండ శ్రీనివాస్
సీఎం చంద్రబాబుకు పెళ్లి పత్రిక అందించిన బెల్లంకొండ శ్రీనివాస్
Chandra Babu Naidu


అమరావతి, 18 ఏప్రిల్ (హి.స.)

టాలీవుడ్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన వివాహానికి హాజరు కావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కుటుంబ సమేతంగా కలిసి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కావ్యారెడ్డితో సాయి శ్రీనివాస్ వివాహం జరగనుంది. ఈనెల 29న తిరుమల పుణ్యక్షేత్రంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి పెళ్లి వేడుక జరగనుంది. అనంతరం మే 1వ తేదీన హైదరాబాద్లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ తన తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్, తల్లి, సోదరుడు గణేశ్తో కలిసి సీఎం చంద్రబాబును, మంత్రి నారా లోకేశ్ను మర్యాదపూర్వకంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. బెల్లంకొండ శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలిపారు.

‘అల్లుడు శీను’ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన సాయి శ్రీనివాస్, మాస్ యాక్షన్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘హైందవ’, ‘టైసన్ నాయుడు’ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande