హిందూ సమ్మేళనం సందర్భంగా తాండూర్లో బైక్ ర్యాలీ
హిందూ సమ్మేళనం సందర్భంగా తాండూర్లో బైక్ ర్యాలీ
హిందూ సమ్మేళనం సందర్భంగా తాండూర్లో బైక్ ర్యాలీ


తాండూర్ , 18 ఏప్రిల్ (హి.స.)

మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలో హిందూ సమ్మేళనం ( Hindu Sammelan ) సందర్భంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ( Bike Rally ) నిర్వహించారు. కిష్టంపేట హనుమాన్ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా కొనసాగింది.భక్తాంజనేయ ఆలయం కూడలి నుంచి సర్వీసు రోడ్డు మీదుగా ఐబీ పురవీధుల గుండా సుమంగళి ఫంక్షన్ హాల్ లో నిర్వహించే సభ స్థలం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పలు గ్రామాల నుంచి ప్రజలు హిందూ సమ్మేళనానికి భారీగా తరలివచ్చారు. తాండూర్ మండల కమిటీ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, యువత, తదితరులు పాల్గొన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande