
హైదరాబాద్, 18 ఏప్రిల్ (హి.స.) తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల 20న జగిత్యాలలో ‘ప్రజా ఆశీర్వాద సభ’ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లలో బీఆర్ఎస్ కీలక నేతలు బిజీబిజీగా ఉన్నారు. స్థానిక నేతలు దగ్గరుండి సభ ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఈ ఏర్పాట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్రావు స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించనున్నారు.
ఆ మేరకు ఆ ఇద్దరు నేతలు కలిసి శనివారం ఉదయం హరీష్రావు నివాసం నుంచి జగిత్యాలకు బయలుదేరారు. వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పార్టీ కీలక నాయకులతో సమావేశమై, సభ నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు జగిత్యాలలో కేటీఆర్, హరీష్రావు ఇద్దరూ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో సభకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi