
డోన్, 19 ఏప్రిల్ (హి.స.) డోన్ జాతీయ రహదారిలోని యు.కొత్తపల్లె వద్ద ఓ ప్రైవేట్ బస్సులో 30 కిలోల వెండి అపహరణకు గురైనట్లు వ్యాపారి పట్టణ పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఓ వ్యాపారి కోయంబత్తూరు నుంచి వెండి తీసుకొని శనివారం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్కు బయలుదేరారు. యు.కొత్తపల్లె సమీపంలోని భారత్ దాబా వద్ద బస్సు నిలిపారు. అక్కడ డ్రైవరు, ప్రయాణికులు టీ తాగేందుకు వెళ్లారు. ఆ సమయంలో బస్సులో వెండితో ఉన్న బ్యాగును ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు. ఆ వ్యాపారి వచ్చి చూసే సరికి బ్యాగు కనిపించక పోవడంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ