సోషల్.మీడియా లో లైక్ ల కోసం బైక్ ల స్టంట్లు యువకుడు.పోలీసుల.అదుపులోకి
కంకిపాడు 19 ఏప్రిల్ (హి.స.)సోషల్ మీడియాలో లైకుల కోసం బైక్ స్టంట్లు వేసి ఇతర ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా పెనమలూరుకి చెందిన వై.మణిశాంత్ రీల్స్లో లైక్స్ కోసం, రోడ్డ
సోషల్.మీడియా లో లైక్ ల కోసం బైక్ ల స్టంట్లు యువకుడు.పోలీసుల.అదుపులోకి


కంకిపాడు 19 ఏప్రిల్ (హి.స.)సోషల్ మీడియాలో లైకుల కోసం బైక్ స్టంట్లు వేసి ఇతర ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా పెనమలూరుకి చెందిన వై.మణిశాంత్ రీల్స్లో లైక్స్ కోసం, రోడ్డుపై ప్రయాణించే వారిని ఆకర్షించేందుకు శుక్రవారం కంకిపాడు- గోసాల, ఈడుపుగల్లు, పెనమలూరు పరిధిలో తన ద్విచక్రవాహనంపై ప్రమాదకరంగా చేసిన స్టంట్స్, రైడ్లతో విన్యాసాలు చేశాడు. వాటిని పలువురు కెమెరాల్లో చిత్రీకరించడంతోపాటు జాతీయ రహదారి కెమెరాల్లోనూ రికార్డయ్యాయి. దీంతో అతడి వాహనం నంబర్ ఆధారంగా యువకుడిపై కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకుని బైకును సీజ్ చేశారు. మరోసారి ఇటువంటి ప్రమాదకర చర్యలకు పాల్పడవద్దని ఎస్సై సందీప్ హెచ్చరించారు. అనంతరం అతడి కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande