
ధర్మవరం: 19 ఏప్రిల్ (హి.స.) జాతీయ అవార్డు గ్రహీత, డిజైనర్ నాగరాజు చేనేత మగ్గాన్ని, పట్టువస్త్రాలను చైనాలో ప్రదర్శించి ధర్మవరానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చారని కలెక్టర్ శ్యామ్ప్రసాద్ కొనియాడారు. శనివారం కలెక్టర్ ధర్మవరంలోని నాగరాజు ఇంటికి వెళ్లారు. ఆయన తయారు చేసిన పట్టువస్త్రాలను పరిశీలించారు. చైనా పర్యటన గురించి అడిగి తెలుసుకున్నారు. డిజైన్లు తయారు చేసే విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు.చేనేత అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇన్ఛార్జి ఆర్డీవో సూర్యనారాయణరెడ్డి, పురపాలక కమిషనర్ వెంకటరమణయ్య, తహసీల్దార్ సురేష్బాబు, చేనేత జౌళిశాఖ ఏడీవోలు సుబ్బానాయుడు, శీనానాయక్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్, తెదేపా పట్టణాధ్యక్షుడు సుధాకర్ పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ