చేనేత.కార్మికులకు ఈ పెహచాన్ కార్డులు
అమరావతి, 19 ఏప్రిల్ (హి.స.) న్యూస్టుడే, శ్రీకాకుళం అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల లబ్ధి పొందాలంటే చేనేత కార్మికులకు గుర్తింపు కార్డు తప్పనిసరి. కొంతకాలంగా కేంద్ర చేనేత జౌళి మంత్రిత్వశాఖ వాటి జారీ ప్రక్రియను నిలిపేయడంతో
చేనేత.కార్మికులకు ఈ పెహచాన్ కార్డులు


అమరావతి, 19 ఏప్రిల్ (హి.స.)

న్యూస్టుడే, శ్రీకాకుళం అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల లబ్ధి పొందాలంటే చేనేత కార్మికులకు గుర్తింపు కార్డు తప్పనిసరి. కొంతకాలంగా కేంద్ర చేనేత జౌళి మంత్రిత్వశాఖ వాటి జారీ ప్రక్రియను నిలిపేయడంతో చాలా మంది పథకాలకు దూరమయ్యారు. ఎట్టకేలకు తిరిగి పొందేందుకు వీలు కల్పించారు.

ఉచిత విద్యుత్తుకూ అవసరమే..

కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో భాగంగా చేనేత కార్మికులకు ఈ నెల నుంచి ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేస్తోంది. లబ్ధిదారులు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పొందొచ్చు. ఈ సౌకర్యం పొందేందుకు ఈపీడీసీఎల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అందుకు కూడా గుర్తింపు కార్డు తప్పనిసరి కావడంతో నేతన్నల్లో ఆందోళన మొదలైంది. జిల్లావ్యాప్తంగా 1,600 మంది కార్మికులు లబ్ధి పొందాల్సి ఉండగా.. తక్కువ కార్డులున్నాయి. మిగిలినవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చేనేత జౌళిశాఖ ఏడీ టి.జనార్దనరావు తెలిపారు.

వాట్సప్ ద్వారా దరఖాస్తు..

సాంకేతిక సమస్యలు దూరం చేసేందుకు వాట్సప్ ద్వారా ఈ-పెహచాన్ కార్డు విధానాన్ని అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించింది. వాట్సాప్ ద్వారా

http://tricorniotec.com/webapp/handloom/home’ లింక్లోకి వెళ్లి.. అందులో సూచించిన వివరాలు నమోదు చేసి దరఖాస్తును ఆన్లైన్లోనే పంపాలి. విజయవాడలోని చేనేత సేవాకేంద్రంలో డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో వాటిని పరిశీలిస్తారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande