తమిళనాడు ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు.. సుడిగాలి పర్యటన
అమరావతి, 19 ఏప్రిల్ (హి.స.) తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) పోలింగ్కు గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఎన్డీయే కూటమి (NDA alliance)లోని కీలక భాగస్వాములు ఒక్కొక్కరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే
చంద్రబాబు, లోకేశ్


అమరావతి, 19 ఏప్రిల్ (హి.స.)

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) పోలింగ్కు గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఎన్డీయే కూటమి (NDA alliance)లోని కీలక భాగస్వాములు ఒక్కొక్కరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) రేపటి నుంచి తమిళనాడులో ప్రచారం నిర్వహించనున్నారు. ముఖ్యంగా తెలుగు జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆయన పర్యటన కూటమికి కలిసొస్తుందని ఎన్డీయే నేతలు భావిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం మధ్యాహ్నం అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్తారు. కోయంబత్తూరు తో పాటు హోసూరు, చెన్నై, ఆవడి వంటి కీలక ప్రాంతాల్లో ఆయన ఎన్నికల బహిరంగ సభలు (Public meetings), రోడ్ షో లో పాల్గొంటారు. ఈ ప్రాంతాల్లో గణనీయంగా ఉన్న తెలుగు ఓటర్లను ఆకర్షించడం తో పాటు, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించనున్నారు. తమిళనాడులో ఈసారి ఏఐఏడీఎంకే-బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ డెమోక్రటిక్ ఫ్రంట్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడి ప్రచారం ఎన్డీయేకి అదనపు బలాన్ని ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇక్కడ కూడా తన ప్రభావాన్ని చాటాలని ప్రయత్నిస్తోంది

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande