
హైదరాబాద్, 19 ఏప్రిల్ (హి.స.)తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్భవన్లో ఈరోజు(ఆదివారం) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం రేవంత్రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎంతో గవర్నర్ చర్చించారు. విద్యారంగానికి సంబంధించి వివిధ అంశాలపై మాట్లాడారు. విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించాలని గవర్నర్ సూచించారు.
ఇందుకు సంబంధించి విద్యార్థులతో ప్రమాణం చేయించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జూన్ 12వ తేదీన ఎల్బీస్టేడియంలో గవర్నర్ ఆధ్వర్యంలో చేపట్టనున్న అవగాహన కార్యక్రమంపై సీఎంతో చర్చించారు. పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్ల సమయంలోనే మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణపత్రం తీసుకోవాలని సూచించారు. గవర్నర్ సూచనలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్