
జగిత్యాల, 19 ఏప్రిల్ (హి.స.)
గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల
ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని అయితుపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులకు నెలకు ఆరు వేల కోట్ల వడ్డీలు చెల్లిస్తున్నామని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు అందిస్తున్నామని తెలిపారు. రైతులకు సబ్సిడీ పైన వ్యవసాయ పనిముట్లు అందిస్తున్నామని అన్నారు. సన్న బియ్యం పండించిన రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ అందిస్తున్నామని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎలాంటి కోతలు లేకుండా ధాన్యం తూకం చేయాలని తూకం పూర్తి అయిన వెంటనే ధాన్యాన్ని మిల్లులకు చేరవేసే బాధ్యత అధికారులు తీసుకోవాలని ట్రక్ షిట్ ఆధారంగా డబ్బులు చెల్లించాలని ఎలాంటి అలసత్వం వహించిన అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
దశాబ్ద కాలంగా కొనుగోలు కేంద్రం కోసం ఎదురు చూస్తున్న అయితుపల్లి రైతులకు ప్రభుత్వ స్థలం ఆరు ఎకరాలు కేటాయించి కొనుగోలు కేంద్రం మంజూరు చేశామని త్వరలోనే ఇట్టి కొనుగోలు కేంద్రాన్ని మినీ మార్కెట్ యార్డ్ గా మార్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయితుపల్లి, నందగిరి గ్రామ ప్రజలు కొనుగోలు కేంద్రం ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తి కాకముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడని మండిపడ్డారు. పదేళ్లలో అక్రమ సంపాదన చేసి అదే అహంకారం తో మాటల మాట్లాడుతున్నాడని మీ అహంకారంకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అయినప్పటికీ అధికారంలోనే ఉన్నామని భావిస్తూ ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలు చేశామని మరో రెండు అమలుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మళ్ళీ వచ్చేది తమ ప్రభుత్వమే అని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు