
వరంగల్, 19 ఏప్రిల్ (హి.స.)వరంగల్లో కొలువుదీరిన భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం భద్రకాళీ అమ్మవారికి గణపతి పూజతో ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం పలు ప్రత్యేక పూజలు ఆలయ పూజారులు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తొలి రోజు ఆలయానికి భక్తులు పోటెత్తారు. భద్రకాళీ అమ్మ వారని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి.
ఈ బ్రహ్మోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు భద్రకాళీ ఆలయానికి తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వేసవి కారణంగా అధిక ఎండల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.
30వ తేదీతో ముగియనున్న కల్యాణ బ్రహ్మోత్సవాలు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్