పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోడీ ఆరా.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
ఢిల్లీ, 19 ఏప్రిల్ (హి.స.) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ఆద
modi


ఢిల్లీ, 19 ఏప్రిల్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ఆదివారం (ఏప్రిల్ 19, 2026) ఉదయం పవన్ కల్యాణ్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ 'X' (ట్విట్టర్) వేదికగా ఒక ఆత్మీయ సందేశాన్ని పంచుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో మాట్లాడి, ఆయన క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నాను. ఆయన ఎంతో ధైర్యవంతుడు. ఆయన అతి త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని ప్రధాని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పట్ల ప్రధాని చూపిన ఈ చొరవ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

గత కొద్ది నెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్, శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో శనివారం సాయంత్రం ఆయనకు వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స (Surgery) నిర్వహించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. వారం నుంచి పది రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోడీతో పాటు లోకేష్, ఇతర రాజకీయ ప్రముఖులు పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande