చంద్రబాబునాయుడికి సత్యప్రసాద్ జన్మదిన శుభాకాంక్షలు
చంద్రబాబునాయుడి జన్మదిన శుభాకాంక్షలు
చంద్రబాబునాయుడికి సత్యప్రసాద్ జన్మదిన శుభాకాంక్షలు


అమరావతి, 20 ఏప్రిల్ (హి.స.)

చంద్రబాబు నాయుడుకి రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా నవ్యాంధ్రను అగ్రగామిగా నిలపడంలో సీఎం చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. టీడీపీని దేశంలోనే అత్యంత పటిష్టవంతమైన కార్యకర్తల పార్టీగా తీర్చిదిద్దిన నేత సీఎం చంద్రబాబు అని గుర్తు చేశారు. సమైక్యాంధ్రలో విజన్ 2020 పేరుతో హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చారని పేర్కొన్నారు.

నవ్యాంధ్రను విజన్ 2047 పేరుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారని వివరించారు. ప్రజా రాజధాని అమరావతి రూపకర్తగా చంద్రబాబు పేరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రజాసేవకే అంకితమైన చంద్రబాబు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నానని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande