తెలంగాణ రాష్ట్రాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకొని. ఏపీలో . క్రికెట్ బెట్టింగ్
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకొని. ఏపీలో . క్రికెట్ బెట్టింగ్
తెలంగాణ రాష్ట్రాన్ని  ప్రధాన కేంద్రంగా చేసుకొని. ఏపీలో . క్రికెట్ బెట్టింగ్


జంగారెడ్డిగూడెం 20 ఏప్రిల్ (హి.స.) , తెలంగాణ రాష్ట్రాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని ఏపీలో బెట్టింగ్కు పాల్పడుతున్న క్రికెట్ బెట్టింగ్ రాకెట్ను ఏలూరు జిల్లా పోలీసులు ఛేదించారు. ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత సారథ్యంలో జంగారెడ్డిగూడెం సీఐ ఎంవీ సుభాశ్, ఎస్సైలు ఎన్.వీరప్రసాద్, జబీర్, ఏఎస్సై ఎన్వీ సంపత్కుమార్ ఇతర పీసీలతో ప్రత్యేక బృందం హైదరాబాద్లో బెట్టింగ్ స్థావరంపై దాడులు చేసి నిర్వాహకులను పట్టుకుంది. ఈ మేరకు జంగారెడ్డిగూడెం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ వివరాలు వెల్లడించారు.

హైదరాబాద్కు చెందిన పుల్లూరి నాగ వెంకట నరసింహాచార్యులు కొద్ది రోజుల కిందట జంగారెడ్డిగూడెం పట్టణానికి వచ్చారు. స్థానిక రాజులకాలనీలోని ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జి ఎస్సై జబీర్కు పక్కా సమాచారంతో ఆయన సిబ్బందితో ఈనెల 17న రాత్రి సదరు ఇంటిపై దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. సబ్ బుకీగా వ్యవహరిస్తున్నట్లు తేలింది. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర జిల్లాల్లోని వ్యక్తులు కలిసి ఓ నెట్వర్క్గా ఏర్పడి భారీ స్థాయిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు.

నరసింహాచార్యులు ఇచ్చిన సమాచారంతో శనివారం రాత్రి జంగారెడ్డిగూడెం పోలీసుల బృందం హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతంలోని క్రికెట్ బెట్టింగ్ ప్రధాన స్థావరంపై దాడి చేసి ప్రధాన బుకీ పల్నాడు జిల్లా మొలకనూరు గ్రామానికి చెందిన మల్లెల వీరాంజనేయులు, ప్రకాశం జిల్లా ఉలగల్లూ గ్రామానికి చెందిన పర్వతనేని వేణుబాబు అలియాస్ వేణు, కడప జిల్లా ఒంటిమిట్ట గ్రామానికి చెందిన గజ్జల రవీంద్రరెడ్డి, అన్నమయ్య జిల్లాకు చెందిన పల్లెపాగ రవి, పల్నాడు జిల్లాకు చెందిన తులబంతుల తాండవ కృష్ణను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 2 ల్యాప్టాప్లు, ఐ ప్యాడ్, కమ్యూనికేటర్ బాక్స్(సిమ్ బాక్స్), 13 చరవాణులు, వైఫై డివైస్లు, 2 టీవీలు, హెడ్ఫోన్స్, రూ.2,30,000 స్వాధీనం చేసుకోవడంతో పాటు పలు బ్యాంకు ఖాతాలకు సంబంధించి రూ.4 లక్షల నగదును సీజ్ చేశారు.

..పట్టుబడ్డ నిందితులు ఆరుగురు ఆన్లైన్ ప్లాట్ఫాం, టెలికమ్యూనికేషన్ సాంకేతికతను ఉపయోగిస్తూ ఓ ముఠాగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలిందని ఏఎస్పీ చెప్పారు. నిందితులు ఉత్తరప్రదేశ్లో ఉన్న పరిచయాల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్ను ఉపయోగిస్తూ.. సాధారణ టీవీ ప్రసారాలకు ముందుగానే ఆన్లైన్ ఫ్లాట్ఫాం ద్వారా ప్రత్యక్షంగా క్రికెట్ మ్యాచ్ను వీక్షించి బెట్టింగ్లో ఆధిక్యం పొందుతున్నారని, లావాదేవీలు అన్ని డిజిటల్ లెడ్జర్ సాఫ్ట్వేర్ ద్వారా నమోదు చేస్తున్నట్లు గుర్తించామని ఏఎస్పీ వెల్లడించారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande