
అమరావతి, 20 ఏప్రిల్ (హి.స.)మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదం కలకలం రేపింది. అతివేగంగా వచ్చిన ఓ మెర్సిడెస్ బెంజ్ కారు ఢీకొనడంతో శ్యామ్ రాజ్ (32) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
జూబ్లీ హిల్స్ నుంచి ఐకియా వైపు వస్తున్న వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ (WB 06B 7003) కలిగిన బెంజ్ కారు బ్రిడ్జిపై ఆగి ఉన్న శ్యామ్ రాజ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో కారు ఇంజన్ భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం కారును కొంత దూరం తీసుకెళ్లి అదే కేబుల్ బ్రిడ్జిపై పార్క్ చేసి, డ్రైవర్తో పాటు మరో వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకున్నారు. ప్రమాదం సమయంలో కారులో ఇద్దరు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ