ఎర్రగొండపాలెం మాచర్ల రహదారిలో లారీ ప్రమాదం
ఎర్రగొండపాలెం మాచర్ల రహదారిలో లారీ ప్రమాదం
ఎర్రగొండపాలెం మాచర్ల రహదారిలో  లారీ ప్రమాదం


యర్రగొండపాలెం, 20 ఏప్రిల్ (హి.స.) యర్రగొండపాలెంలోఈరోజు తెల్లారుజామున మాచర్ల రహదారిలోని ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఓ లారీ అదుపు తప్పి టీ టిఫిన్ హోటల్లోకి దూసుకెళ్లింది. అప్పటికి హోటల్ తెరవలేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోరుమామిళ్ల వైపు నుంచి నిజమాబాద్కు సజ్జల లోడుతో వెళ్తున్న లారీ మార్గమధ్యంలో వై.పాలెం మాచర్ల రోడ్డులోని టిఫిన్ హోటల్ వద్దకు వచ్చే సరికి డ్రైవర్ నిద్రపోవడంతో అదుపు తప్పి హోటల్లోకి వెళ్లింది. అప్పటికిదాని యజమానులైన వీరబ్రహ్మం, కార్మికులు హోటల్కు రాకపోయే సరికి ప్రమాదం తప్పింది. హోటల్తో పాటు దానిలో సామగ్రి మొత్తం ధ్వంసం అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande