వాడపల్లి వెంకటేశ్వర స్వామి కి స్వర్ణ పూత రేకులు బహూకరణ
వాడపల్లి వెంకటేశ్వర స్వామి కి స్వర్ణ పూత రేకులు బహూకరణ
వాడపల్లి వెంకటేశ్వర స్వామి కి స్వర్ణ పూత రేకులు బహూకరణ


ఆత్రేయపురం:, 20 ఏప్రిల్ (హి.స.) అక్షయ తృతీయ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురానికి చెందిన చాదస్తం ఫుడ్స్ యజమాని చవ్వాకుల సాయిగణేష్, ప్రసన్న దంపతులు కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామికి ఆదివారం స్వర్ణ పూతరేకులు సమర్పించారు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన ఆరు పూతరేకులను నైవేద్యంగా సమర్పించారు. ఒక్కో పూతరేకును రూ.2 వేలు విలువ చేసే ఎడిబుల్ గోల్డ్తో తయారు చేశామని, వీటిని తినొచ్చని వ్యాపారి సాయిగణేష్ తెలిపారు. పెద్దకుమార్తె సంజనవాసుకు సుమారు 25 కిలోల లడ్డూతోను, చిన్నకుమార్తె సరయుకు 1300 పూతరేకులతో(రూ.25 వేలు ఖరీదు చేసే) తులాభారం నిర్వహించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande