చిన్నారుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి.. మంత్రి దుద్దిళ్ల
జయశంకర్ భూపాలపల్లి, 20 ఏప్రిల్ (హి.స.) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలం దేవరంపల్లి ప్రభుత్వ పాఠశాలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల విద్యార్థినులతో పాఠం చెప్పించి సరదాగా ముచ్చటించారు.
మంత్రి దుద్దిల్ల


జయశంకర్ భూపాలపల్లి, 20 ఏప్రిల్ (హి.స.) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలం దేవరంపల్లి ప్రభుత్వ పాఠశాలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల విద్యార్థినులతో పాఠం చెప్పించి సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బాల్యంలోనే మంచి విద్య, విలువలు అలవాటు పడితే పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని పేర్కొన్నారు. చిన్నారుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు పాఠశాలలు, తల్లిదండ్రులు కలిసి కృషి చేయాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు ఆధునిక పరిజ్ఞానం అందించాలన్నారు. కాటారంలో ప్రభుత్వ విద్యాలయాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దారన్నారు. అనంతం పాఠశాలలో మరుగుదొడ్లను వెంటనే నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతం కాంగ్రెస్ నాయకులతో సరదాగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సంబంధిత అధికారులు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande