శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం
శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం
శ్రీవారి మెట్టు మార్గంలో  చిరుత సంచారం


చంద్రగిరి, , 20 ఏప్రిల్ (హి.స.)శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఆదివారం ఉదయం శేషాచల అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుత శ్రీవారిమెట్టు మార్గం దాటి పక్కనే సరస్వతీ మండపం వద్ద సంచరిస్తూ ఉండటాన్ని కాలినడక భక్తులు గుర్తించారు. విజిలెన్స్ సిబ్బందికి సమాచారాన్ని చేరవేయడంతో సిబ్బంది వచ్చి చిరుత ఓ చెట్టు కొమ్మపై కూర్చుని ఉండటాన్ని గుర్తించారు. వారు పెద్దగా చప్పుడు చేయడంతో అడవిలోకి వెళ్లిపోయింది. విజిలెన్స్ సిబ్బంది భక్తులు, పాదచారులను అప్రమత్తం చేశారు. శ్రీవారిమెట్టు మార్గంలో గుంపులుగా వెళ్లాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande