సీఎం చంద్రబాబు పుట్టిన రోజు.. స్పెషల్ విషెస్ చెబుతూ ప్రధాని మోడీ ట్వీట్
సీఎం చంద్రబాబు పుట్టిన రోజు.. స్పెషల్ విషెస్ చెబుతూ ప్రధాని మోడీ ట్వీట్
modi


అమరావతి, 20 ఏప్రిల్ (హి.స.)తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని, చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబును తన ఆప్తమిత్రులు అని సంబోధించిన ప్రధాని మోడీ.. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కొనియాడారు. తన స్నేహితుడు చంద్రబాబు నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలోనూ ప్రగతిలో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని మోడీ తన సందేశంలో పేర్కొన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రధాని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజా సేవలో నిరంతరం శ్రమిస్తున్న చంద్రబాబుకు భగవంతుడు దీర్ఘాయుష్షును, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.

కేవలం ప్రధాని మాత్రమే కాకుండా, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు ప్రముఖులు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ అభివృద్ధి వేగవంతం అవుతున్న తరుణంలో, ప్రధాని మోడీ చేసిన ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో ప్రధాని ట్వీట్ను భారీగా షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande