ఏపీ వ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం
అమరావతి, 20 ఏప్రిల్ (హి.స.)ప్రజా సేవలోనే అసలైన ఆనందం ఉందని చాటి చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నేడు తన 76వ పుట్టినరోజును పేదల మధ్య అత్యంత నిరాడంబరంగా జరుపుకున్నారు. సీఎం చంద్రబాబు పుట్టిన రోజును మరింత అర్థవంతంగా మార్చేందుకు నారా భువనేశ్
free-meals-in-anna-canteens-across-ap-542348


అమరావతి, 20 ఏప్రిల్ (హి.స.)ప్రజా సేవలోనే అసలైన ఆనందం ఉందని చాటి చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నేడు తన 76వ పుట్టినరోజును పేదల మధ్య అత్యంత నిరాడంబరంగా జరుపుకున్నారు. సీఎం చంద్రబాబు పుట్టిన రోజును మరింత అర్థవంతంగా మార్చేందుకు నారా భువనేశ్వరి రూ. 76 లక్షల భారీ విరాళాన్ని రాష్ట్రంలోని అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం ప్రకటించారు. ఆదివారం సాయంత్రమే ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును ఆమె అధికారులకు అందజేశారు. ఈ విరాళం ఫలితంగా, నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 269 అన్న క్యాంటీన్లలో పేదలకు, సామాన్యులకు ఉచితంగా భోజనం వడ్డిస్తున్నారు. సాధారణంగా ఐదు రూపాయలకే లభించే ఈ భోజనాన్ని నేడు ఉచితంగా అందించడం ద్వారా వేలాది మంది పేద కూలీలు మరియు బాటసారులకు సీఎం జన్మదిన కానుక అందింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande