మళ్లీ గెలిచేది ఏఐఏడీఎంకే- బీజేపీ కూటమే: చంద్రబాబు
చెన్నై, 20 ఏప్రిల్ (హి.స.) అన్నాడీఎంకే(AIADMK) అంటే గుర్తు వచ్చేది జయలలిత(Jayalalithaa)నని, మళ్లీ గెలిచేది ఏఐఏడీఎంకే- బీజేపీ కూటమేనని ఏపీ సీఎం చంద్రబాబు(Ap Cm Chandrababu) అన్నారు. తమిళనాడు ఎన్నికల్లో(Tamilnadu Elections) ఆయన ప్రచారం నిర్వహించారు.
చంద్రబాబు, లోకేశ్


చెన్నై, 20 ఏప్రిల్ (హి.స.)

అన్నాడీఎంకే(AIADMK) అంటే గుర్తు వచ్చేది జయలలిత(Jayalalithaa)నని, మళ్లీ గెలిచేది ఏఐఏడీఎంకే- బీజేపీ కూటమేనని ఏపీ సీఎం చంద్రబాబు(Ap Cm Chandrababu) అన్నారు. తమిళనాడు ఎన్నికల్లో(Tamilnadu Elections) ఆయన ప్రచారం నిర్వహించారు. తమిళనాడుకు పూర్వవైభవం రావాలంటే ఎన్డీఏ అభ్యర్థులకే ఓటు వేయాలని పిలుపు నిచ్చారు. 2024లో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చిందని... 22 నెలల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.

ఐదేళ్లుగా చెన్నైలో అభివృద్ధి లేదు

‘‘గడచిన ఐదేళ్లుగా చెన్నై అభివృద్ధి ఆగిపోయింది. తమిళ ప్రజలకు ప్రయోజనాలు అందటం లేదు. కేంద్రం సహకరిస్తున్నా డీఎంకే దానిని వినియోగించుకోవటం లేదు. తమిళనాడుకు అప్పులు పెరిగాయి... యువత డ్రగ్స్ బారిన పడుతున్నారు. డీఎంకే హయాంలో నేరాల రేటు బాగా పెరిగిపోయింది. తమిళ ప్రజల మధ్య విబేధాలు, విద్వేషాలను తీసుకువచ్చారు. తమిళనాడుకు కేంద్రం లక్షల కోట్ల రూపాయలను అందించింది. సాగర్ మాల కింద రూ.93 వేల కోట్లను వ్యయం చేశారు. గతంలో చెన్నై ఉమ్మడి రాజధానిగా ఏపీ తమిళనాడు కలిసే ఉన్నాయి. ఇప్పుడు చెన్నై వెనుకపడిపోయింది. జయలలిత స్థాపించిన ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలవాలి. అభివృద్ధి సాధించాలి. డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తే ప్రగతి అంటే ఏమిటో మీరే చూస్తారు.’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande