తిరుమలలో దర్శనానికి వెళ్లి వచ్చి.. యువతి అదృశ్యం
తిరుమలలో దర్శనానికి వెళ్లి వచ్చి.. యువతి అదృశ్యం
తిరుమలలో దర్శనానికి వెళ్లి వచ్చి.. యువతి అదృశ్యం

తిరుమల:, 21 ఏప్రిల్ (హి.స.)

తిరుమలలో దర్శనానికి వెళ్లి వచ్చిన ఓ యువతి అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి స్వామి వారి దర్శనానికి గుంటూరు సంగడిగుంటకు చెందిన లక్ష్మీతిరుపతమ్మ వెళ్లింది. దర్శనం అనంతరం గదికి వచ్చి మళ్లీ బయటకు వెళ్లింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దలు కుదర్చిన వివాహం నచ్చక అలిగి వెళ్లినట్లు తెలుస్తోందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande