ఎమ్మిగనూరు పట్టణంలో నీ శిల్పా నగర్ లోభారీ చోరీ
ఎమ్మిగనూరు పట్టణంలో నీ శిల్పా నగర్ లోభారీ చోరీ
ఎమ్మిగనూరు పట్టణంలో నీ శిల్పా నగర్ లోభారీ చోరీ


ఎమ్మిగనూరు ,, 21 ఏప్రిల్ (హి.స.)

పట్టణంలోని శిల్పానగర్లో భారీ చోరీ జరిగింది. పెద్దఎత్తున బంగారాన్ని దొంగలు అపహరించారు. వివరాల మేరకు.. కె.శంకర్రెడ్డి అనే వ్యక్తి కుమార్తె వివాహం మరో రెండు వారాల్లో ఉంది. ఈ నేపథ్యంలో పెళ్లి పత్రికలను బంధువులకు ఇచ్చేందుకు ఆదివారం ఇంటికి తాళం వేసి వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న 20 తులాల బంగారు, రూ.15 వేల నగదు అపహరించారు. పనిమనిషి ఉదయం వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి ఉండటంతో.. అదే కాలనీలో ఉంటున్న శంకర్రెడ్డి బంధువులకు చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కర్నూలు నుంచి క్లూస్ టీం బృందం వచ్చి ఆధారాలు సేకరించింది. సుమారు రూ.30 లక్షల విలువైన బంగారం అపహరణకు గురవడంతో బాధితులు ఆవేదనలో మునిగిపోయారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande