ఔటర్ సర్వీస్ రోడ్డు పై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
ఔటర్ సర్వీస్ రోడ్డు పై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
Accident


హైదరాబాద్, 21 ఏప్రిల్ (హి.స.)

ఔటర్ సర్వీస్ రోడ్డు పై మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని డీసీఎం బైక్ ను ఢీకొట్టగా బైక్ పై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన తండ్రి కొడుకులు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వనస్థలిపురం, సాహెబ్ గూడలో నివాసం ఉండే కొమ్మగోని ప్రశాంత్ గౌడ్ (41) విద్యుత్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా మంగళవారం ఉదయం తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి తన బైక్ పై రావిర్యాలలోని సూర్యగిరి ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు.

ఈ క్రమంలోనే రావిర్యాల, వాండర్ల సమీపంలో డీసీఎం వాహనం బైక్ ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొమ్మగోని ప్రశాంత్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కుమారుడు శ్రీతన్ (11) కు తీవ్రగాయాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగిలిన గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ఇద్దరికి కాలికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఆదిబట్ల సీఐ రవికుమార్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande