అంబర్పేటలో అగ్ని.ప్రమాదం
అంబర్పేటలో అగ్ని.ప్రమాదం చోటుచేసుకుంది
అంబర్పేటలో అగ్ని.ప్రమాదం


హైదరాబాద్:, 27 ఏప్రిల్ (హి.స.)

హైదరాబాద్లోని అంబర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అంబర్పేట్ పరిధిలోని చే నెంబర్ జంక్షన్ వద్ద ఉన్న మహీంద్రా షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు, షోరూంలో ఉన్న సిబ్బంది భయంతో బయటకి పరుగులు తీశారు.

వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande