బీఆర్ఎస్ ఓ ‘చచ్చిన శవం’.. కవిత పార్టీ అవసరమే లేదు: రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ ఓ ‘చచ్చిన శవం’.. కవిత పార్టీ అవసరమే లేదు: రేవంత్ రెడ్డి
Telangana CM Revanth Reddy


హైదరాబాద్, 27 ఏప్రిల్ (హి.స.)

కొత్త ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందని ఆయన అన్నారు. చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా ప్రయోజనం ఉండదు.. బీఆర్ఎస్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది అంటూ విరుచుకుపడ్డారు.

పదేళ్ల అహంకార పూరిత పాలన వల్లే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని, దాని మనుగడే ప్రశ్నార్థకమైందని వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో కల్వకుంట్ల కవిత ప్రకటించిన కొత్త పార్టీపై పరోక్షంగా సెటైర్లు వేస్తూ.. రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరమే లేదని, అసలు ఉన్న పార్టీయే (బీఆర్ఎస్) ఉంటుందో, ఊడుతుందో తెలియని స్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీలకు ప్రజలు అవకాశం ఇవ్వరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande