
తాళ్లూరు27 ఏప్రిల్ (హి.స.)
: ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని పెట్రోల్ బంకుల్లో సోమవారం అధికారుల బృందం ఆకస్మికంగా తనిఖీలు చేసింది. ఇన్ఛార్జి తహసీల్దార్ జి.పణీంద్ర, ఎస్సై మల్లికార్జునరావు, పలువురు సిబ్బందితో కలిసి తాళ్లూరు, తూర్పగంగవరం, బొద్ధికూరపాడులోని ఎనిమిది పెట్రోల్ బంకుల్లో ఆయిల్ నిల్వలను పరిశీలించారు. అక్కడ వాహనదారులకు విక్రయిస్తున్న తీరును గమనించారు. ఈ తనిఖీల్లో ఆర్ఐ సుధీర్ పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ