తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. జీవో రిలీజ్ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. జీవో రిలీజ్ చేసిన ప్రభుత్వం
G o


హైదరాబాద్, 21 ఏప్రిల్ (హి.స.)

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం బదిలీల ప్రక్రియ 1 మే 2026 నుండి మే 31, 2026 వరకు కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ 1, 2026 నుండి తిరిగి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని పేర్కొంది. 1 జనవరి 2026 నాటికి ఒకే చోట మూడేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీకి అర్హులుగా పేర్కొంది అయితే నాలుగేళ్లు పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది.

మే 31, 2027 లోపు పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులను వారి అభ్యర్థన లేనిదే బదిలీ చేయరుని, జీవిత భాగస్వామి (Spouse) ఆధారంగా కోరుకునే బదిలీలకు మూడేళ్ల నిబంధన వర్తించదని స్పష్టం చేశారు. ఏ ఒక్క క్యాడర్లో కూడా 40 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులను బదిలీ చేయకూడదని పేర్కొంది. బదిలీల ప్రక్రియ మొత్తం కౌన్సెలింగ్ పద్ధతిలో సాధ్యమైనంత వరకు ఆన్లైన్/వెబ్ ఆధారిత అప్లికేషన్ ద్వారా పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే කයිව సమయంలో భార్యాభర్తలు (ఒకరికి మాత్రమే), పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారు, 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు, మానసిక వికలాంగులైన పిల్లలున్న తల్లిదండ్రులు, వితంతువులు, క్యాన్సర్, కిడ్నీ, లివర్ మార్పిడి వంటి తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. బదిలీల ప్రక్రియను పర్యవేక్షించడానికి క్యాడర్ వారీగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande