కిలాడీ లేడీలు.. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లమంటూ రైడ్
కిలాడీ లేడీలు.. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లమంటూ రైడ్
Food safety


హైదరాబాద్, 21 ఏప్రిల్ (హి.స.)

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లమంటూ చెబుతూ

దుకాణాల పై రైడ్లు నిర్వహిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడిన ఇద్దరు మహిళా నకిలీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన మంగళవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఓల్డ్ ఆల్వాల్ ఐజీ ప్రాంతంలోని ఒక స్వీట్ హౌస్లోకి వెళ్లిన వారు తామే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లమని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అనుమానం వచ్చిన స్వీట్ హౌస్ యజమాని స్థానిక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కు ఫోన్ చేశారు. అందుబాటులో ఉన్న అధికారి స్వీట్ హౌస్ వద్దకు చేరుకుని వారిని ప్రశ్నించగా, తాము ప్రైవేట్ వ్యక్తులమని, వేరే సంస్థకు చెందినవారమని తప్పించుకోవడానికి ప్రయత్నించారు. దీంతో యజమాని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నకిలీ మహిళా ఆఫీసర్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande