
గోదావరిఖని, 21 ఏప్రిల్ (హి.స.)
ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. మంగళవారం హనుమాన్నగర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యా, సంక్షేమ మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ ద్వారా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అడ్డగుంటపల్లి అదనపు తరగతి గది నిర్మాణం, పాఠశాల అభివృద్ధి పనులను ప్రారంభించి ఆయన మాట్లాడారు. సుమారు రూ.25 లక్షల ఎస్ డి ఎఫ్ (SDF), డి ఎం ఎఫ్ టి (DMFT) నిధులతో చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించబడుతుందన్నారు. ఈ పనులు పూర్తయ్యాక విద్యార్థులకు సౌకర్యవంతమైన తరగతి గదులు, మెరుగైన మౌళిక వసతులు అందుబాటులోకి రానున్న అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..