గుంటూరు నగరంలో అక్రమ నిర్మాణాల పై అధికారుల కొరడా
గుంటూరు నగరంలో అక్రమ నిర్మాణాల పై అధికారుల కొరడా
గుంటూరు నగరంలో  అక్రమ నిర్మాణాల పై అధికారుల  కొరడా

గుంటూరు:, 21 ఏప్రిల్ (హి.స.) గుంటూరు నగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝళిపించారు. మోతీలాల్నగర్లోని రైల్వే స్థలాల్లో ఆక్రమణలను అధికారులు కూల్చివేశారు. అయితే.. ఇళ్ల తొలగింపును సీసీఐ కార్యకర్తలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, రైల్వే అధికారులతో సీసీఐ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande