
జగిత్యాల,21 ఏప్రిల్ (హి.స.)బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రేవంత్ రెడ్డి శనిలా మారారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఇంకా రెండేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారో లేదో అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఏ క్షణమైనా మార్పులు జరగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా రేవంత్ రెడ్డి బీజేపీతో ములాఖత్ అయ్యారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆయనకు నమ్మకం లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. సొంత కుంపటి పెట్టుకోవాలనే ఆలోచనలో రేవంత్ ఉన్నారని ఆయన ఆరోపించారు. తన రాజకీయ ప్రయాణంపై స్పందిస్తూ, తన సమర్థత వల్లే తాను అన్ని సార్లు అవకాశాలు పొందానని జీవన్ రెడ్డి అన్నారు. తాను ఎవరినీ తొక్కుకుంటూ రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్