కాళేశ్వరంపై సీబీఐతో విచారణ చేయించు.. బండి సంజయ్కు ఎంపీ చామల సవాల్
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్కు కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
MP


హైదరాబాద్, 21 ఏప్రిల్ (హి.స.)కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్కు కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలది రాహుకేతు గ్రహమని బండి సంజయ్ అంటున్నారని.. అసలు బండి సంజయ్ ఏ గ్రహమని ఎద్దేవా చేశారు. అసలు నవగ్రహాల్లో ఆయన ఉన్నారా...? అని ప్రశ్నించారు. ఈరోజు (మంగళవారం) హైదరాబాద్ వేదికగా మీడియాతో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. బండి సంజయ్ ప్రెస్మీట్లకే పరిమితమయ్యారని విమర్శించారు. తెలంగాణలోని పెండింగ్ సమస్యలను పరిష్కారించాలనే ఆలోచన ఆయనకు ఏమైనా ఉందా...? అని నిలదీశారు. మెట్రో పేజ్ 2, ట్రిపుల్ ఆర్, మూసీ ప్రక్షాళన విషయంలో బండి సంజయ్ వైఖరి ఏంటి..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. భువనగిరి లోక్సభ పరిధిలో నిధులు తీసుకువచ్చే సభను కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి కలిసి పెట్టాలని.. పార్టీలకు అతీతంగా ప్రజలను తీసుకువచ్చే బాధ్యత తమదని చెప్పుకొచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తే 24 గంటల్లో చర్యలు చేపడతామని కిషన్ రెడ్డి అన్నారని.. మరి ఇప్పుడేమి చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. 2025 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఇస్తే ఇప్పటి వరకు విచారణ ఎందుకు చేయట్లేదని నిలదీశారు. అనవసరమైన అంశాల్లో కేంద్ర జేబు సంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్లి ఆలోచన లేని పని చేశారని.. కేసీఆర్ ఆయనకు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్లో జీవన్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్గా చేయాలని అనుకున్నామని తెలిపారు. నిన్నటితో జీవన్ రెడ్డి ఎపిసోడ్ అయిపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్లో అలిగినట్లు బీఆర్ఎస్లో అలిగితే ఎవరు పట్టించుకోరని విమర్శించారు. కాంగ్రెస్లో అలిగితే టీపీసీసీ ప్రెసిడెంట్, ఏఐసీసీ సెక్రటరీలు జగిత్యాల దాకా వచ్చారని ప్రస్తావించారు. జనరల్ సెక్రటరీ పదవికి కాంగ్రెస్లో ఏ స్థాయి ఉంటుందో జీవన్ రెడ్డికి తెలుసునని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పీసీసీ ప్రెసిడెంట్గా చేసి బీఆర్ఎస్లో చేరితే ఇప్పుడు పరిస్థితి ఏంటి...? అని ఎద్దేవా చేశారు. పొన్నాలకు పట్టిన గతే.. రేపు జీవన్ రెడ్డికి పడుతుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు గుప్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande