
చెన్నై, 21 ఏప్రిల్ (హి.స.) తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ
రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా సీఎం ఎం. కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే (DMK) కూటమికి మద్దతు ఇస్తున్నట్లుగా ఆలిండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.
ఆ వీడియోలో ఒవైసీ మాట్లాడుతూ.. తమిళనాడు అభివృద్ధి, లౌకికవాద పరిరక్షణే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లందరూ డీఎంకే కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. మైనారిటీల సంక్షేమం, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా స్టాలిన్ నాయకత్వానికి అండగా నిలవాలని తమ పార్టీ కార్యకర్తలకు, మద్దతుదారులకు సూచించారు. ఒవైసీ తీసుకున్న ఈ నిర్ణయం తమిళనాడులోని ముస్లిం ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు