
కృష్ణాజిల్లా, 21 ఏప్రిల్ (హి.స.)మచిలీపట్నం సర్వజన ప్రభుత్వాస్పత్రిలో ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఈరోజు (మంగళవారం) బైకుపై వచ్చి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పార్కింగ్ చేయకుండా అడ్డదిడ్డంగా ఉన్న వాహనాలను చూసి సెక్యూరిటీ విభాగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లుగా వాహనాలు పార్కింగ్ చేస్తుంటే సిబ్బంది ఏం చేస్తున్నారని మందలించారు. అనంతరం పలు విభాగాల్లో తనిఖీలు చేశారు. అలాగే, ఓపీ రిజిస్ట్రేషన్లను పరిశీలించి.. ఓపీలో చాలామంది రోగులు వేచి ఉండటంపై మంత్రి ఆరా తీశారు.
కౌంటర్ల సంఖ్యను పెంచాలని సూపరింటెండెంట్కు మంత్రి ఆదేశించారు. ఓపీలో రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. రక్తనమూనా పరీక్షల విభాగం, ఎక్సరే విభాగాలను పరిశీలించారు. ఆస్పత్రి వైద్యులతో సమావేశమై వైద్య సేవల గురించి చర్చించారు. పారిశుద్ధ్య, పార్కింగ్ వ్యవస్థను మెరుగుపర్చాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్